ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా పాచిపెంట మండలం ఈతమానువలసలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కరోనా సోకిన వ్యక్తి కుటుంబీకులను గ్రామస్థులు వెలివేశారు. ఓ వ్యక్తికి కరోనా రావడంతో అధికారులు ఆస్పత్రికి తరలించారు.
అమానుషం... కరోనా సోకిన వ్యక్తి కుటుంబీకులను వెలివేసిన గ్రామస్థులు - ఈతమానువలసలో కరోనా బాధితుని కుటుంబం బహిష్కరణ వార్తలు
మానవ సంబంధాలు రోజురోజుకి దిగజారిపోతున్నాయి. కరోనా సోకిన వ్యక్తి కుటుంబీకులను అక్కడి గ్రామస్థులు ఊరినుంచి వెలివేశారు. ఈ అమానవీయన ఘటన ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా పాచిపెంట మండలం ఈతమానువలసలో జరిగింది.
![అమానుషం... కరోనా సోకిన వ్యక్తి కుటుంబీకులను వెలివేసిన గ్రామస్థులు villagers-banished-the-corona-infected-victims-family-from-the-eethamanuvalasa-village-at-vizianagaram-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7971988-414-7971988-1594380821880.jpg)
కరోనా సోకిన వ్యక్తి కుటుంబీకులను ఊరినుంచి వెలివేసిన గ్రామస్థులు
బాధితుడితో సంబంధం ఉన్న 15 మంది కుటుంబసభ్యులను ఆసుపత్రికి తరలించలేదని గ్రామస్థులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. వెంటనే వారిని ఊరినుంచి వెలివేశారు. చేసేదేం లేక, ఎటువెళ్లాలో తెలియక వారు చిన్నపిల్లలతో సహా ఊరు బయట పశువులపాకలో తలదాచుకున్నారు. రాత్రి వర్షం కురవడంతో బాధితులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటనపై పాచిపెంట మండల తహసీల్దార్ విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి :ప్రోటోకాల్ పాటించక ఘర్షణ.. గాయపడ్డ పశుసంవర్ధక అధికారి