తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఇంకెందుకు రాద్ధాంతం చేస్తున్నారని పోలీసులు బెదిరిస్తున్నారు' - ntr district latest news

Complaint on disha police: ఏపీలోని విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్యాచారానికి గురైన బాధితురాలి తల్లిదండ్రులు.. "దిశ" పోలీసులపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం న్యాయం చేసిందిగా ఇంకెందుకు రాద్ధాంతం అంటూ తమను బెదిరిస్తున్నారని బాధితులు వాపోయారు. ఈ మేరకు స్పందన కార్యక్రమంలో దిశ పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Complaint on disha police
Complaint on disha police

By

Published : Apr 25, 2022, 3:44 PM IST

Updated : Apr 25, 2022, 4:12 PM IST

Complaint on disha police: "ప్రభుత్వం న్యాయం చేసిందిగా ఇంకెందుకు రాద్ధాంతం చేస్తున్నారు" అంటూ "దిశ" పోలీసులు తమను బెదిరిస్తున్నారని... ఏపీలోని విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలి తల్లిదండ్రులు కలెక్టర్‌ కార్యాలయం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. డబ్బులు ఇస్తే న్యాయం జరిగిపోయినట్లేనా? అని ప్రశ్నిస్తూ ఆవేదన వ్యక్తంచేశారు. ఘటన తర్వాత అమ్మాయి ఫలానా చోట ఉంది తెచ్చుకోండి అన్నారే తప్ప, ఒక్క పోలీసూ సాయానికి రాలేదని కన్నీటి పర్యంతమయ్యారు.

తమ కుటుంబానికి జరిగిన అన్యాయం మరెవ్వరికీ జరగకూడదనే పోరాడుతున్నాం.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలంటూ ఆ తల్లిదండ్రులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.

'మా పిల్లకి న్యాయం చేయకపోతే మేము బతికేదే లేదు. మా అమ్మాయి పిచ్చిది... ఏమి తెలియని అమాయకురాలు. ఆసుపత్రిలో నుంచే తీసుకెళ్లి అలా చేశారంటే సమాజంలో ఆడిపిల్ల బతికేదేలా ? పిచ్చి పిల్ల మా అమ్మాయి రెండు రోజులు 30 గంటల సేపు అలా చేశారంటే ఎలా బతుకుతుంది? మేమే మా బిడ్డ ఉన్న ప్రదేశానికి వెళ్లి తీసుకొచ్చుకున్నాం. అమ్మాయిని చూడగానే గుండెలు పగిలిపోయాయి. దిశ పోలీసులపై ఫిర్యాదు చేసేందుకు మేము కలెక్టర్ దగ్గరకి వస్తే న్యాయం జరిగిపోయింది కదా ఇంకేందుకు వచ్చారంటున్నారు.'-బాధితురాలి తల్లిదండ్రులు

ఇదీ చదవండి:టాలీవుడ్ డ్రగ్స్ కేసులో హైకోర్టుకు క్షమాపణలు చెప్పిన ఎక్సైజ్​ డైరెక్టర్

Last Updated : Apr 25, 2022, 4:12 PM IST

ABOUT THE AUTHOR

...view details