తెలంగాణ

telangana

ETV Bharat / city

గణేష్​ ఉత్సవాలకు అనుమతి లేదు: విజయవాడ సీపీ - vijayawada latest news

కరోనా కేసుల దృష్ట్యా ఏపీలోని విజయవాడ నగరంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు అనుమతి లేదని నగర సీపీ తెలిపారు. ఎవరి ఇళ్లల్లో వారే పూజలు చేసుకోవాలని సూచించారు. స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు.

గణేష్​ ఉత్సవాలకు అనుమతి లేదు: విజయవాడ సీపీ
గణేష్​ ఉత్సవాలకు అనుమతి లేదు: విజయవాడ సీపీ

By

Published : Aug 20, 2020, 7:41 PM IST

Updated : Aug 20, 2020, 8:13 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా... వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి లేదని నగర సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. తమ తమ ఇళ్లల్లోనే పూజలు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఊరేగింపులు, నిమజ్జనాలు చేసుకోవడానికి అనుమతి లేదన్న సీపీ... ఆలయాల్లోనూ కరోనా నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

2016లో 77 ఏళ్ల వృద్ధురాలిపై జరిగిన అత్యాచార ఘటనలో నిందితుడైన కోటేశ్వరరావుకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించిందని తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో బాగా పనిచేసిన సిబ్బందికి రివార్డులు అందిస్తామని అన్నారు. కారు దహనం కేసులో ఐదుగురు పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో దర్యాప్తు కొనసాగుతోందని...ఇప్పటికే చాలా మందిని విచారించామని పేర్కొన్నారు.

Last Updated : Aug 20, 2020, 8:13 PM IST

ABOUT THE AUTHOR

...view details