తెలంగాణ

telangana

ETV Bharat / city

అచ్చెన్నాయుడి కేసు విచారణ.. బుధవారానికి వాయిదా - Atchannaidu news in acb court

మాజీమంత్రి అచ్చెన్నాయుడు, ఇఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ సీకే రమేశ్ కుమార్​ను తమ కస్టడీకి అప్పగించాలని అనిశా దాఖలు చేసిన పిటిషన్​పై ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ కోర్టులో వాదనలు ముగిశాయి. అవినీతి నిరోధక చట్టం నిబంధనల ప్రకారం.. ప్రజాపత్రినిధి వ్యవహారంలో ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించాలన్నా... గవర్నర్ ఆమోదం పొందాల్సి ఉంటుందని అచ్చెన్నాయుడి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.

vijayawada-acb-court-on-ex-minister-atchannaidu-custody
అచ్చెన్నాయుడి కేసుపై విచారణ... బుధవారానికి వాయిదా...

By

Published : Jun 24, 2020, 2:14 PM IST

మాజీమంత్రి అచ్చెన్నాయుడు, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ మాజీడైరెక్టర్ రమేశ్ కుమార్‌ను తమ కస్టడీకి ఆప్పగించాలని అనిశా దాఖలు చేసిన పిటిషన్​పై ఏపీలోని విజయవాడ కోర్టులో వాదనలు ముగిశాయి. తనను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లేలా ఆదేశాలివ్వాలని అచ్చెన్నాయుడు దాఖలు చేసిన మరో పిటిషన్​పైనా​ వాదనలు పూర్తయ్యాయి. ఇరువైపు న్యాయవాదుల వాదనలు విన్న ఏడో అదనపు జిల్లా కోర్టు జడ్జి... విచారణను బుధవారానికి వాయిదా వేశారు. అచ్చెన్నాయుడి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని గుంటూరు జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.

అచ్చెన్నాయుడు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించారు. పోలీసు కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఆరోగ్యం సరిగా లేక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇప్పటికే పోలీసులు వివరాలు సేకరించారని వాదించారు. అవినీతి నిరోధక చట్ట నిబంధనల ప్రకారం.. ప్రజాపత్రినిధి వ్యవహారంలో ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించాలన్నా... గవర్నర్ ఆమోదం పొందాల్సి ఉందని పేర్కొన్నారు. అందుకు భిన్నంగా పోలీసులు వ్యవహరించారని వాదనలు వినిపించారు.

అనిశా తరఫున ఏపీ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ... మరికొన్ని వివరాలు రాబట్టాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో నిందితుల కస్టడీ అవసరం ఉందని వివరించారు. టెలిహెల్త్ సర్వీసు ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వివిధ సేవలు అందించే నిమిత్తం పనులు అప్పగించేలా అప్పటి కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు... ఇఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ సీకే రమేశ్ కుమార్‌ను ఒత్తిడి చేశారన్న ఆరోపణలతో అనిశా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి:'భారత్​- చైనా' మధ్య 11 గంటల చర్చ ఎందుకంటే?

ABOUT THE AUTHOR

...view details