కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే... కరోనా బాధితులను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్టు స్పష్టమవుతుందని కాంగ్రెస్ ప్రచార కమిటీ వైస్ ఛైర్ పర్సన్ విజయశాంతి విమర్శించారు. ప్రధానమైన గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రుల్లోని పరిణామాలే... ఇందుకు సాక్ష్యమన్నారు.
గాంధీ ఆస్పత్రిలో కరోనాతో మరణించిన ఒక వ్యక్తి మృతదేహాన్ని దాదాపు రోజంతా మిగిలిన రోగుల మధ్యే ఉంచి వారిని భయభ్రాంతుల్ని చేశారని... ప్రభుత్వం ప్రజలకు ఇందుకు సమాధానం చెప్పాలన్నారు. ఇక ఉస్మానియా ఆసుపత్రి మురికినీళ్ల పాలై నరకాన్ని తలపించిందని.. నిమ్స్‌లోనూ ఏమంత ఆశాజనక పరిస్థితులు లేవని విచారం వ్యక్తం చేశారు.