తెలంగాణ

telangana

ETV Bharat / city

జేపీ నడ్డాను కలిసిన విజయశాంతి, గూడూరు - గూడూరు నారాయణ రెడ్డి వార్తలు

భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను విజయశాంతి, గూడూరు నారాయణ రెడ్డి కలిశారు. రాష్ట్రంలో బండి సంజయ్‌ నాయకత్వంలో భాజపా అధికారంలోకి వస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.

vijayashanthi meet jp nadda
vijayashanthi meet jp nadda

By

Published : Dec 8, 2020, 7:16 AM IST

2023 ఎన్నికల్లో భాజపా తెలంగాణలో అధికారంలోకి వస్తుందని మాజీ ఎంపీ విజయశాంతి ధీమా వ్యక్తం చేశారు. భాజపాలో చేరిన అనంతరం పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విజయశాంతి విమర్శించారు.

జేపీ నడ్డాను కలిసిన విజయశాంతి

భాజపాలోకి గూడూరు..

పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి భాజపా తీర్థం పుచ్చుకున్నారు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన భాజపాలో చేరారు. అంతకుముందు నారాయణరెడ్డి.. కాంగ్రెస్‌ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో బండి సంజయ్‌ నాయకత్వంలో భాజపా అధికారంలోకి వస్తుందని గూడూరు నారాయణరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ నుంచి తొలి గిరిజన మహిళా పైలట్‌ అయిన అజ్మీరా బాబీ భాజపా ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్​ సమక్షమంలో భాజపాలో చేరారు. బాబీ స్వగ్రామం దండేపల్లి మండలం కర్ణపేట. రాబోయే రోజుల్లో బాబీ మంచిర్యాల జిల్లాలో భాజపా శ్రేణుల కోసం పనిచేయనున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి :కేసీఆర్​ను గద్దె దించుతాం : విజయశాంతి

ABOUT THE AUTHOR

...view details