ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వైకాపాకు చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. బెయిల్ రద్దు పిటిషన్‌పై నిర్ణయాన్ని సీబీఐ కోర్టుకే వదిలిపెట్టింది. తమ విచక్షణ మేరకు పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలంటూ న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది.
VIJAYASAI BAIL: 'విజయసాయిరెడ్డి బెయిల్ రద్దుపై నిర్ణయం మీదే' - విజయసాయిరెడ్డి బెయిల్ పిటిషన్
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. బెయిల్ రద్దు పిటిషన్‌పై నిర్ణయాన్ని సీబీఐ కోర్టుకే వదిలిపెట్టింది.
![VIJAYASAI BAIL: 'విజయసాయిరెడ్డి బెయిల్ రద్దుపై నిర్ణయం మీదే' VIJAYA SAI BAIL](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12760184-399-12760184-1628844335913.jpg)
VIJAYA SAI BAIL
మరోవైపు సీబీఐ నిర్ణయంపై కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలని విజయసాయిరెడ్డి కోర్టును కోరారు. అనంతరం పిటిషన్‌పై తదుపరి విచారణను కోర్టు ఈనెల 16కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: Telangana High Court : జీవో 208పై దాఖలైన పిల్‌పై విచారణ ముగించిన హైకోర్టు