తెలంగాణ

telangana

ETV Bharat / city

గీతంపై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి ఫిర్యాదు - MP vijayasaireddy news

ఏపీ విశాఖపట్నంలోని గీతం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ అనేక నిబంధనలు ఉల్లంఘించిందని, దానిపై విచారణకు ఆదేశించాలని జాతీయ వైద్య కమిషన్ ‌(ఎంసీఐ)ను వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు.

జాతీయ మెడికల్ కౌన్సిల్​కు వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి లేఖ
జాతీయ మెడికల్ కౌన్సిల్​కు వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి లేఖ

By

Published : Oct 27, 2020, 12:05 PM IST

ఏపీ విశాఖలోని గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్​లో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి ... జాతీయ మెడికల్ కౌన్సిల్​కు లేఖ రాశారు. వైద్య కళాశాల అనుమతి కోసం గీతం యాజమాన్యం నకిలీ పత్రాలు సమర్పించిందని ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూమిలో ల్యాబ్​లు, హాస్టళ్లు, సిబ్బంది నివాసాలు కట్టారని లేఖలో పేర్కొన్నారు.

వాటికి ఎలాంటి అనుమతీ తీసుకోలేదన్నారు. ఆర్డీవో బృందం విచారణలో 40 ఎకరాల 51సెంట్ల సర్కారు భూమిని ఆక్రమించినట్టుగా తేలిందన్నారు. ఎంసీఐ నిబంధనలను ఎక్కడా పాటించకుండా మెడికల్ కళాశాలను నిర్మించారని విజయసాయి ఫిర్యాదు చేశారు.

ఇదీ చూడండి:అంజన్​ రావు ఇంట్లో రూ. 18.67 లక్షలు స్వాధీనం: సిద్దిపేట సీపీ

ABOUT THE AUTHOR

...view details