ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా పార్వతీపురం పోలీసులు.. అంధ జంటకు మానవత్వంతో సాయం చేశారు. కర్ఫ్యూ సమయంలో వాహనాల్లేక ఇంటికి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న వారికి అండగా నిలిచారు.
అంధ దంపతులకు సాయం... మానవత్వం చాటుకున్న పోలీసులు - parvathipuram police humanity
ఏపీలోని విజయనగరం జిల్లా పార్వతీపురం పోలీసులు.. అంధ దంపతులను ఆపదలో ఆదుకున్నారు. కర్ఫ్యూ సమయంలో వాహనాల్లేక ఇంటికి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి.. నివాసానికి చేర్చారు.

మానవత్వం చాటుకున్న పోలీసులు
మానవత్వం చాటుకున్న పోలీసులు
పార్వతీపురం లెప్రసీ కాలనీలో నివాసం ఉంటున్న అంధ దంపతులను.. పోలీసు వాహనంలో తీసుకెళ్లి ఇంటివద్ద విడిచిపెట్టారు. తమకు సాయం చేసిన పార్వతీపురం డీఎస్పీ సుభాష్, సీఐ లక్ష్మణరావు, ఇతర సిబ్బందికి ఆ దంపతులు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి: Wonder: చనిపోయిందనుకొని అంత్యక్రియలు.. కానీ అంతలోనే...!