విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ (Congress Party) నిరసన కార్యక్రమాలు శనివారం ప్రారంభం కానున్నాయి. గాంధీ జయంతి ( Gandhi Jayanti) (అక్టోబరు 2) నుంచి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదినం (Sonia Gandhi's birthday) డిసెంబరు 9 వరకు ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్’ (Vidyardhi Nirudyoga Jung Siren)పేరిట ఈ కార్యక్రమాలు చేపట్టనుంది.
శనివారం మధ్యాహ్నం 3 గంటలకు దిల్‌సుఖ్నగర్ రాజీవ్ చౌక్‌లో ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి అక్కడి నుంచి ఎల్బీనగర్‌లోని శ్రీకాంతాచారి విగ్రహం వరకు పాదయాత్ర చేపట్టనున్నారు. శ్రీకాంతాచారి స్పూర్తితో ముందుకెళ్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతర ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. పాత 10 జిల్లాల్లోని విశ్వవిద్యాలయాలు, కాలేజీలు వేదికగా డిసెంబరు 9 వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరగా.. డిసెంబరు 9న సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో సభ నిర్వహిస్తామని.. దీనికి అగ్రనేత రాహుల్‌గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు పార్టీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభల్లాగే ఈ కార్యక్రమాలూ విజయవంతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని.. విద్యార్థి, నిరుద్యోగ యువత, తెలంగాణ సమాజం కలిసి రావాలని రేవంత్‌రెడ్డి ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
సభలో విద్యార్థులు పాసయ్యేలా కేసీఆర్ పాఠాలు చెప్పడం లేదు: జగ్గారెడ్డి