పెండింగ్లో ఉన్న విద్యా వాలంటీర్ల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ ఐకాస ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లిలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు రావాల్సిన వేతనాలు ప్రభుత్వం విడుదల చేయకపోగా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో తమ జీవనం కుదేలైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట విద్యా వాలంటీర్ల ధర్నా
హైదరాబాద్ నాంపల్లిలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరుద్యోగ ఐకాశ ఆధ్వర్యంలో విద్యా వాలంటీర్లు ధర్నా నిర్వహించారు. పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట విద్య వాలంటీర్ల ధర్నా
ఎన్నోసార్లు సంబంధిత అధికారులతో గోడు చెప్పుకున్న పట్టించుకోవట్లేదని ఐకాస ఛైర్మన్ నీల వెంకటేష్ వాపోయారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని తమను ఆదుకోవాలని వెంకటేష్ కోరారు.
ఇదీ చదవండిఃదుబ్బాక గెలుపుపై పార్టీల ధీమా... మెజార్టీ లెక్కల్లో నేతలు