తెలంగాణ

telangana

ETV Bharat / city

'మీ డబ్బు ఎవడికి కావాలి.... న్యాయం చేయండి చాలు'

ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాలలో ఎస్సీ యువకుడి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్​ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన 10 లక్షల రూపాయల చెక్కును అధికారులు అందించారు.

chirala-youth
'మీ డబ్బు ఎవడికి కావాలి.... న్యాయం చేయండి చాలు'

By

Published : Jul 24, 2020, 10:50 PM IST

ప్రజాస్వామ్య దేశంలో మనిషిని పోలీసులు కొట్టిచంపే హక్కు ఉందా... అని ప్రకాశం జిల్లా చీరాలలో అధికారులను ఎస్సీ యువకుని బంధువులు నిలదీశారు. మాస్కు పెట్టుకోలేదని పోలీసులు కొట్టిన దెబ్బలకు కిరణ్ కుమార్ అనే యువకుడు మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని. జాయింట్ కలెక్టర్ వెంకట మురళీ, ఒంగోలు ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి, చీరాల డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పరామర్శించారు.

ప్రభుత్వం ప్రకటించిన రూ. 10 లక్షల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. తప్పుచేస్తే.. కేసు పెట్టాలి... అంతేకాని కొట్టి చంపే హక్కు ఎవరిచ్చారని అధికారులను నిలదీశారు. కిరణ్ మృతికి కారణమైన ఎస్.ఐ విజయ్ కుమార్, మిగిలిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తిగా విచారించి ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.

'మీ డబ్బు ఎవడికి కావాలి.... న్యాయం చేయండి చాలు'

ఇవీచూడండి:చీరాల దళిత యువకుడు మృతి....దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశం

ABOUT THE AUTHOR

...view details