Rape Victim in AP : ఆంధ్రప్రదేశ్లోని హిందూపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళపై ఇంటివద్ద జరిగిన చిన్న గొడవ విషయమై సోమశేఖర్, అఖిల్, అక్కులప్ప అనే ముగ్గురు వ్యక్తులు కక్ష పెంచుకున్నారు. మే 23న ఎవరూ లేని సమయంలో ఆమె ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి పాల్పడగా.. మరునాడు ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తగాదా కింద కేసు నమోదు చేసి ఇంటికి పంపారు. ఆనక మాపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అంటూ భౌతిక దాడికి దిగడమే కాక.. మరోసారి అత్యాచారం చేశారు. వారికి భయపడి బెంగళూరుకు మకాం మార్చగా.. ఫోన్ ద్వారా వేధిస్తున్నారు.
'అత్యాచారమని ఫిర్యాదు చేస్తే.. తగాదా కేసు పెట్టారు సార్..' - సత్యసాయి జిల్లాలో అత్యాచారం కేసు
Rape Victim in AP : తనపై అత్యాచారం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. కేవలం చిన్నపాటి తగాదా కింద కేసు నమోదు చేసి అన్యాయం చేశారని ఓ బాధితురాలు ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్ వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో స్పందనలో ఆమె ఫిర్యాదు చేశారు. అసలు ఏం జరిగిందంటే..?

'అత్యాచారమని ఫిర్యాదు చేస్తే.. తగాదా కేసు పెట్టారు సార్..'
ఈ విషయాన్ని బాధిత మహిళ సోమవారం ఎస్పీ దృష్టికి తెచ్చారు. తనకు న్యాయం చేయని పక్షంలో ఇక్కడే చనిపోతానంటూ విలపించారు. అయితే, ఈ కేసులో నిందితులను కాపాడేందుకు అదే మండలంలోని ఓ పంచాయతీ సర్పంచి భర్త, వైకాపా నాయకుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇసుక వ్యాపారంలో తనకు సహకరిస్తున్నందున నిందితులపై తక్కువ తీవ్రత గల సెక్షన్లతో కేసులు నమోదు చేయించారన్న అభియోగాలు వినిపిస్తున్నాయి.