తెలంగాణ

telangana

ETV Bharat / city

Venkaiah Naidu: 'నైపుణ్యాభివృద్ధికే కేంద్ర ప్రభుత్వం పెద్దపీట'

కరోనాతో అన్ని రంగాలు కుదేలైనా..రైతన్నలు మాత్రం వ్యవసాయ ఉత్పత్తిని రెట్టింపు చేశారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah Naidu) కొనియాడారు. రైతులకు ఉపయోగపడేలా ఇన్నోవేషన్స్ తీసుకురావాలని, యువత ఉపాధి మార్గాల కోసం కొత్త నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. ఉపరాష్ట్రపతి హైదరాబాద్​లోని స్వర్ణభారత్ ట్రస్ట్​ను సందర్శించారు.

vice-president-venkaiah-naidu-
వెంకయ్యనాయుడు

By

Published : Jul 16, 2021, 2:28 PM IST

Updated : Jul 16, 2021, 4:55 PM IST

Venkaiah Naidu: 'నైపుణ్యాభివృద్ధికే కేంద్ర ప్రభుత్వం పెద్దపీట'

ప్రకృతి పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) అభిప్రాయపడ్డారు. ప్రకృతి పరిరక్షణను, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ ఆరోగ్యకరమైన భవిష్యత్ నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. హైదరాబాద్ ముచ్చింతల్ స్వర్ణభారత్ ట్రస్ట్‌ను సందర్శించిన ఉపరాష్ట్రపతి(Venkaiah Naidu) దంపతులు.. అక్కడ కొనసాగుతున్న వివిధ శిక్షణా కార్యక్రమాలను పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించారు. వివేకానంద విగ్రహానికి నివాళులు అర్పించిన వెంకయ్య(Venkaiah Naidu).. శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ముచ్చటించారు. కరోనా కారణంగా ఏడాదిన్నరగా స్వర్ణ భారతి ట్రస్ట్‌ను సందర్శించలేకపోయానని..కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

నాలుగో పారిశ్రామికీకరణ నేపథ్యంలో.. అవసరమైన నూతన నైపుణ్యాలతో యువత తమను తాము తీర్చిదిద్దుకోవాలని వెంకయ్యనాయుడు(Venkaiah Naidu) ఆకాంక్షించారు. భవిష్యత్ భారత నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమన్న ఉపరాష్ట్రపతి... నైపుణ్యం కలిగిన యువతరమే నవ్యభారతాన్ని సమగ్రంగా నిర్మించగలదని అభిలషించారు. ఇందుకోసమే స్వర్ణభారత్ ట్రస్ట్ నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని తెలిపారు.

'గత మూడు పారిశ్రామిక విప్లవాల్లో ఉన్న నైపుణ్యాలు నాలుగో పారిశ్రామిక విప్లవంలో పూర్తిగా మారతాయని గ్లోబల్ బిజినెస్ కో ఎవల్యూషన్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ నివేదిక తెలిపింది. కేంద్రప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యావిధానంలో.. నైపుణ్యాభివృద్ధికి పెద్ద పీట వేసింది. స్కిల్ ఇండియా లాంటి పథకాలు ఈ బాధ్యతను తలకెత్తుకున్నాయి. పర్యావరణానికి మనం దూరమవుతున్న ప్రస్తుత తరుణంలో.. రోజుకో రకంగా వ్యాపిస్తున్న వివిధ వ్యాధుల నుంచి అప్రమత్తంగా ఉండేందుకు ప్రకృతితో మమేకమవ్వడము ఒక్కటే మార్గం.'

- వెంకయ్యనాయుడు(Venkaiah Naidu), ఉపరాష్ట్రపతి

21వ శతాబ్దంలో.. దగ్గరున్న వస్తువులను మాత్రమే చూడగలిగే మయోపియా వ్యాప్తి పట్ల వెంకయ్య (Venkaiah Naidu) ఆందోళన వ్యక్తం చేశారు. 2050 నాటికి సగం ప్రపంచ జనాభా ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందన్న వైద్యుల హెచ్చరికతో... నాలుగు గోడల మధ్య జీవన విధానానికి స్వస్తి చెప్పి, ప్రకృతికి మరింత దగ్గర కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకుడు జి.ఎన్.రావు, స్వర్ణభారత్ ట్రస్ట్ అధ్యక్షుడు చిగురుపాటి కృష్ణ ప్రసాద్, కార్యదర్శి సుబ్బారెడ్డి, మల్లారెడ్డి విద్యాసంస్థల కోశాధికారి భద్రారెడ్డి పాల్గొన్నారు.

Last Updated : Jul 16, 2021, 4:55 PM IST

ABOUT THE AUTHOR

...view details