Wash Conclave 2022 : స్వచ్ఛమైన తాగు నీరు అందించినప్పుడే ఆరోగ్యకరమైన సమాజం నిర్మించడం సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థలో "నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత - డబ్ల్యూఏఎస్‌హెచ్ - 2022"పై జరిగిన జాతీయ సమాలోచన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎన్‌ఐఆర్‌డీ, యూనెసెఫ్ సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరగనున్న ఈ వర్చువల్ సదస్సును చెన్నైలో రాజ్‌భవన్ నుంచి అంతర్జాతీయ వేదిక ద్వారా ఆయన ప్రారంభించారు.
మూడు రోజులపాటు వర్చువల్ జరిగే ఈ సదస్సులో కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, యూనిసెఫ్ భారత్ ప్రతినిధి గిలియన్ మెల్సోప్ పాల్గొన్నారు. కరోనా సమయంలో అందరికి తరచుగా చేతులు కడుక్కోవడం అలవాటైందని... ఇకపై కూడా కొనసాగించడం ద్వారా ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. చిన్నతనం నుంచే పిల్లలకు పరిశుభ్రతపై పూర్తి అవగాహన కల్పించాలని ఉపరాష్ట్రపతి సూచించారు.