తెలంగాణ

telangana

By

Published : Jan 9, 2020, 11:45 AM IST

Updated : Jan 9, 2020, 12:58 PM IST

ETV Bharat / city

ఓట్ల కొనుగోలు, డబ్బు పంపకం.. పరిపాటిగా మారింది: ఉపరాష్ట్రపతి

'రాజకీయాల్లో ధన ప్రభావం' అనే అంశంపై ఐఎస్‌బీలో జరుగుతున్న సదస్సుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుత రాజకీయాలు ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్నాయన్న ఆయన... బీరు, బిర్యానీలకు ఓటర్లు దూరంగా ఉండాలన్నారు.

ఓట్ల కొనుగోలు, డబ్బు పంపకం.. పరిపాటిగా మారింది: ఉపరాష్ట్రపతి
ఓట్ల కొనుగోలు, డబ్బు పంపకం.. పరిపాటిగా మారింది: ఉపరాష్ట్రపతి

రాజకీయాల్లో ధన ప్రవాహం అంశంపై ఇండియన్​ స్కూల్​ ఆఫ్ బిజినెస్​లో రెండు రోజుల పాటు జరుగుతున్న సమావేశానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజకీయాల్లో ధన ప్రవాహంపై ఇండియన్ డెమోక్రసీ ఎట్​వర్క్​ సంస్థ ద్వారా స్వచ్ఛ రాజకీయాల కోసం జయప్రకాశ్​ నారాయణ పాటుపడుతున్నారని ప్రశంసించారు.

దేశం ఇంకా పేదరికంలో ఎందుకు మగ్గిపోతోందో ఆలోచించాలని ఉపరాష్ట్రపతి సూచించారు. రాజకీయ పార్టీలకు తప్పకుండా జ వాబుదారీతనం ఉండాలని పేర్కొన్నారు. నాయకులు పార్టీ కార్యక్రమాలకు, జన సమీకరణకు ఎంతో ఖర్చు చేస్తున్నారన్న వెంకయ్యనాయుడు..బీరు, బిర్యానీ జనసమీకరణకు ప్రజలు దూరంగా ఉండాలన్నారు. ప్రస్తుత రాజకీయాలు ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్నాయని ఆయన వాపోయారు.

దేశంలో ఏడాదిపాటు ఎన్నికలు కొనసాగుతూనే ఉన్నాయని వెంకయ్యనాయుడు అన్నారు. పంచాయతీతో పాటు అన్ని ఎన్నికలు ఒకే వారంలో జరిగేలా చూడాలని తెలిపారు.

'రాజకీయాల్లో ధన ప్రభావం' అనే అంశంపై ప్రసంగిస్తున్న ఉపరాష్ట్రపతి
Last Updated : Jan 9, 2020, 12:58 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details