ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా (వరల్డ్ హెరిటేజ్ సైట్ ) యునెస్కో గుర్తించడం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణ వారసత్వ సంపదకు ఇది గొప్ప గుర్తింపుగా వెంకయ్య అభివర్ణించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికి ట్విట్టర్ వేదికగా... శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి:RAMAPPA TEMPLE UNESCO: రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు
వారసత్వ కట్టడాల విశిష్టతల పరిశీలనకోసం... ఉద్దేశించిన ప్రపంచ హెరిటేజ్ కమిటీ 44వ సమావేశం చైనాలోని ఫ్యూజులో ఈ నెల 16 న ప్రారంభమైంది. 2020, 21 సంవత్సరాలకు గాను.. ప్రపంచ వ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు... యూనెస్కో పరిశీలనకు ఎంపికవగా... మన దేశం నుంచి 2020 సంవత్సరానికి రామప్పకు మాత్రమే ఈ ఖ్యాతి దక్కింది.
రామప్పకు అంతర్జాతీయ గుర్తింపు లభించటం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. కాకతీయ శిల్పకళా వైభావానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: