తెలంగాణ

telangana

ETV Bharat / city

నెల్లూరు ఆయుర్వేద మందుపై అధ్యయనం చేయాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్య

ఏపీలోని నెల్లూరు ఆయుర్వేద మందుపై అధ్యయనం చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. ఈ మేరకు ఆయూష్ ఇన్​ఛార్జి మంత్రి కిరణ్ రిజ్జు, ఐసీఎంఆర్ డైరక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ్​కు సూచించారు.

vice president  nellore
vice president nellore

By

Published : May 21, 2021, 9:20 PM IST

కరోనా చికిత్స కోసం ఏపీలోని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో.. వనమూలికలు, ఇతర పదార్థాలతో తయారు చేస్తున్న ఔషధాన్ని ఆనందయ్య అనే వ్యక్తి ఉచితంగా ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ఈ ఆయుర్వేద మందు విషయంలో నెలకొన్న పరిస్థితులు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దృష్టికి చేరాయి. దీనిపై స్పందించిన ఉపరాష్ట్రపతి.. వెంటనే ఆయూష్ ఇన్​ఛార్జి మంత్రి కిరణ్ రిజ్జు, ఐసీఎంఆర్ డైరక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ్​తో ఫోన్​లో మాట్లాడారు. ఆయుర్వేదం ఔషధంపై అధ్యయనం చేయాలని.. వీలైనంత త్వరగా నివేదిక వచ్చేలా చూడాలని వారికి సూచించారు.

ఇదీ చూడండి..అన్ని విధాలా అండగా ఉంటాం: సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details