తెలంగాణ

telangana

ETV Bharat / city

Condolences on Sirivennela: సిరివెన్నెల.. 'తెలుగుపాటకు వన్నెలద్దిన మహనీయుడు' - venkaiah Condolences to Sirivennela

Condolences to Sirivennela: ప్రఖ్యాత గేయ రచయిత 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి మృతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం జగన్, తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. సిరివెన్నెల మృతి సినీ రంగానికి తీరని లోటన్నారు.

Condolences to Sirivennela
Condolences to Sirivennela

By

Published : Nov 30, 2021, 7:26 PM IST

Vice President Condolences to Sirivennela: ప్రఖ్యాత గేయ రచయిత 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి(66) మృతిపై ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తెలుగుపాటకు వన్నెలద్దిన మహనీయుడు.. సిరివెన్నెల అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన ప్రతిపాటా అభిమానించే వారిలో తానూ ఒకరని చెప్పారు. సిరివెన్నెల ఆత్మకు శాంతి కలగాలని కోరారు.

CM Jagan Condolences to Sirivennela: విలువల శిఖరం..: - సీఎం జగన్

సిరివెన్నెల మృతిపట్ల ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ తీవ్ర సంతాపం తెలిపారు. సిరివెన్నెల మృతి తెలుగువారికి తీరని లోటన్నారు. ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

'తెలుగు సినీగేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల. అక్షరాలతో సిరివెన్నెల చేసిన భావ విన్యాసాలు స్థిరంగా ఉంటాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి' - ఏపీ ముఖ్యమంత్రి జగన్

chandrababuCondolences to Sirivennela:సినీ రంగానికి తీరని లోటు - చంద్రబాబు

సిరివెన్నెల మృతి సినీరంగానికి తీరని లోటని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. సిరివెన్నెల జీవితం నేటి యువతకు ఆదర్శమన్న ఆయన.. పాటలతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. సిరివెన్నెల మృతి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.

Sirivennela Sitaramasastri died: ప్రముఖ గేయ రచయిత 'సిరి వెన్నెల' సీతారామశాస్త్రి(66) తుదిశ్వాస విడిచారు. న్యూమోనియాతో బాధపడుతూ ఇటీవల ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. సీతారామశాస్త్రి మృతితో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన 'సిరివెన్నెల' చిత్రంలో 'విధాత తలపున' గేయంతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఆ సినిమా టైటిల్‌నే ఇంటిపేరుగా సుస్థిరం చేసుకున్నారు. 800కు పైగా చిత్రాల్లో దాదాపు 3వేల పాటలు ఆయన హృదయ కమలం నుంచి కలంలోకి చేరి అక్షరాలై శ్రోతలను మంత్ర ముగ్ధులను చేశాయి. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019లో పద్మశ్రీతో సత్కరించింది.

ఇదీచూడండి:Sirivennela Passed Away: పాటల గని, విజ్ఞాన ఖని.. సిరివెన్నెల!

ABOUT THE AUTHOR

...view details