విజయదశమి పండుగ శుభసందర్భంలో దేశ ప్రజలందరికీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాల మధ్య దసరా పండుగను వైభవోపేతంగా నిర్వహించుకోవడం సంప్రదాయంగా వస్తోందని వెంకయ్యనాయుడు అన్నారు.
దేశప్రజలకు ఉపరాష్ట్రపతి విజయదశమి శుభాకాంక్షలు - venkaiah naidu wishes happy dasara
దేశ ప్రజలందరికీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ ద్వారా దసరా శుభాకాంక్షలు తెలిపారు. పండుగ ద్వారా ప్రజలందరి జీవితాల్లో శాంతి, సామరస్యం వెల్లివిరిసి, శ్రేయస్సును కలగజేయాలని ఆయన ఆకాంక్షించారు.
దేశప్రజలకు ఉపరాష్ట్రపతి విజయదశమి శుభాకాంక్షలు
ఆత్మీయులందరితో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగే విజయదశమి అని.. కానీ ఈ ఏడాది కొవిడ్ -19 మహమ్మారి వల్ల ప్రజలందరూ కరోనా నియమనిబంధనలకు అనుగుణంగా, ప్రభుత్వ సూచనలను పాటిస్తూ కుటుంబసభ్యులతో కలిసి ఇంటి వద్దనే జరుపుకోవాలని ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి-రాష్ట్ర ప్రజలకు సీఎం విజయదశమి శుభాకాంక్షలు