దేశభక్తి, జాతీయవాదంపై అనేకమంది అనవసర చర్చలు చేస్తున్నారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. సకల భారతీయుల హితం కోరడమే అసలైన జాతీయవాదమని ఆయన స్పష్టం చేశారు. సికింద్రాబాద్ మారియట్ హోటల్‌లో వాజ్‌పేయీ మెమోరియల్ సదస్సులో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. వాజ్‌పేయీతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సమర్థ నాయకత్వం, సుస్థిర పాలన అందించగలిగిన వాజ్‌పేయీ..ఎందరికో ఆదర్శమని కొనియాడారు. ఎన్నో సాహసోపేత సంస్కరణలతో దేశ రూపురేఖలు మార్చారని వెంకయ్యనాయుడు ప్రశంసించారు.
'వాజ్‌పేయీ ఆలోచనలను అర్థం చేసుకోవడం కష్టం'
సికింద్రాబాద్ మారియట్ హోటల్‌లో నిర్వహించిన వాజ్‌పేయీ మెమోరియల్ సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. వాజ్‌పేయీతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సాహసోపేతమైన ఆర్థిక సంస్కరణలను వాజ్‌పేయీకి అమలు చేశారని కొనియాడారు.
వాజ్‌పేయీతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన నుంచి నేటితరం యువత ఎంతో నేర్చుకోవాలి. వాజ్‌పేయీ తన భావాలను కవితల రూపంలో వెల్లడించేవారు. వాజ్‌పేయీ సముద్రం లాంటి వ్యక్తి. వాజ్‌పేయీ లోతైన ఆలోచనలను అర్థం చేసుకోవడం కష్టంగా ఉండేది. భాష, సాహిత్యం విషయంలో ఆయన తిరుగులేని వ్యక్తి. అన్ని అంశాలను మనసుకు హత్తుకునేలా, భావుకత్వంతో చెప్పేవారు. సాహసోపేతమైన ఆర్థిక సంస్కరణలను వాజ్‌పేయీకి అమలు చేశారు. - వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి.
ఇవీ చూడండి:లింక్ క్లిక్ చేస్తే చాలు... ఓటీపీ చెప్పకుండానే ఖాతా ఖాళీ...!