ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయ నిర్మాణాన్ని పక్కన పెట్టి తక్షణమే ఉస్మానియా ఆస్పత్రిని కొత్తగా నిర్మించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతురావు డిమాండ్ చేశారు. బుధవారం కురిసిన వర్షానికి ఉస్మానియా ఆస్పత్రిలో నీరు చేరడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో రోగులకు కూడా రక్షణ లేకుండా పోతోందని మండిపడ్డారు.
'చిన్నజీయర్ స్వామి దయ తలచి కేసీఆర్‌కు చెప్పాలి' - vh reaction on osmania
బుధవారం కురిసిన భారీ వర్షానికి ఉస్మానియా ఆస్పత్రిలోకి నీరు చేరడంపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో రోగులకు కూడా రక్షణ లేదని మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు చెప్తే వినే పరిస్థితిలో కేసీఆర్ లేరని, చిన్న జీయర్ స్వామైనా ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం గురించి సీఎంకు చెప్పాలని విజ్ఞప్తి చేశారు.
చిన్నజియ్యర్ స్వామైనా దయతలచి కేసీఆర్‌కి చెప్పాలి: వీహెచ్
కేసీఆర్ సీఎం అయినప్పుడు ఉస్మానియా ఆస్పత్రిని కొత్తగా నిర్మిస్తానని ఇచ్చిన హామీని గుర్తుచేశారు. ఆరేళ్లు గడిచినా అతీగతీ లేదని ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్తే వినే పరిస్థితి లేనందున చిన్నజీయర్ స్వామైనా దయతలచి ముఖ్యమంత్రికి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.
ఆహార భద్రత కార్డులేని నిరుపేదలకు అందరికి ఆహార ధాన్యాలు అందేలా చూడాలని కోరుతూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు వీహెచ్ లేఖ రాశారు.