సొంతపార్టీ నాయకుల తీరుపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హన్మంతరావు మరోసారి అసంతృప్తి వెలిబుచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెందిన కొందరు మద్దతుదారులు సామజిక మాధ్యమాల్లో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తూ పోస్టింగులు పెడుతున్నారని ఆరోపించారు. కర్ణాటక అంశాన్ని ప్రస్తావించిన ఆయన రాష్ట్రంలోనూ కొందరు కాంగ్రెస్ నాయకులు సామాజిక మాధ్యమాల్లో ఇతరులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం తనకు బాధకలిగిస్తోందన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితో పార్టీకి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆయన మండిపడ్డారు.
సొంతపార్టీ నేతల తీరుపై వీహెచ్ ఆగ్రహం - Vh Fire on Congress leaders latest news
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హన్మంతరావు సొంతపార్టీ నాయకుల తీరుపై మరోసారి తీవ్రంగా విరుచుకపడ్డారు. కొందరు సామజిక మాధ్యమాల్లో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తూ పోస్టింగులు పెడుతున్నారని ఆరోపించారు.
సొంతపార్టీ నేతల తీరుపై వీహెచ్ ఆగ్రహం
తక్షణమే సామాజిక మాధ్యమాల్లో ఇతరులను కించపరిచేట్లు వ్యాఖ్యలు చేయడం ఆపకుంటే తాము కూడా అదే స్థాయిలో స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు. గతంలో ఎప్పుడులేని ఆనవాయితీ పార్టీలో ఇటీవల వచ్చిందని, పార్టీకి నష్టం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. కోర్‌కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తే... తాజా రాజకీయాలపై తాడోపీడో తేల్చుకుంటామని వీహెచ్ అన్నారు.
ఇదీ చూడండి :కొండకల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. భూమిపూజ చేసిన కేటీఆర్, హరీశ్