సినీ పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయిందని ‘శివాజీ రాజా అన్నారు. ఇంటి పెద్ద దిక్కు లేని లోటు ఎవరు పూడ్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ ఆమె నటించారని గుర్తు చేశారు. వృత్తిపరంగానే కాదు.. వ్యక్తిగతంగాను ఆమె ఎప్పుడూ సంతోషంగా, అందరితో కలివిడిగా ఉండేవారన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానని శివాజీ రాజా పేర్కొన్నారు.
గీతాంజలి మృతిపట్ల "మా" దిగ్భ్రాంతి - Geetanjali Ramakrishna passes away
సీనియర్ నటి గీతాంజలి మృతిపట్ల మా’ అసోషియేషన్‌లోని సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సినీ రంగానికి పెద్ద దిక్కును కోల్పోయామని సంతాపం తెలిపారు. సాయంత్రం మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
గీతాంజలి మృతిపట్ల "మా" దిగ్భ్రాంతి
మరోవైపు ‘మా’ అసోషియేషన్ సభ్యులు గీతాంజలి మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నటిగానే కాకుండా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు ఎంతోకాలంగా సేవలందిస్తున్నారు. ఆమె మృతి చిత్రసీమకే కాకుండా, ‘మా’కు తీరని లోటని అసోసియేషన్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి జీవిత, ఇతర కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఇవాళ సాయంత్రం మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.