తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఆధునిక యుగంలో పర్యావరణ పరిక్షణ ఓ సవాల్' - ప్రపంచ పర్యావరణ దినోత్సవం

ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ... ఈ ఆధునిక యుగంలో పర్యావరణ పరిరక్షణ అనేది పెద్ద సవాల్​గా మారింది. సహజ వనరులైన నీరు, భూమి, గాలి కలుషితమై మానవాళి, జీవరాశులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రపంచ పర్యావణ దినోత్సవం సందర్భంగా ఈటీవీ భారత్​ కథనం

'ఆధునిక యుగంలో పర్యావరణ పరిక్షణ ఓ సవాల్'
'ఆధునిక యుగంలో పర్యావరణ పరిక్షణ ఓ సవాల్'

By

Published : Jun 5, 2020, 5:53 AM IST

ప్రపంచవ్యాప్తంగా అనూహ్య వాతావరణ మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయి. కీలక అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ... ఈ ఆధునిక యుగంలో పర్యావరణం పరిరక్షణ అనేది పెద్ద సవాల్‌గా మారింది. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహార, ఉద్యాన పంటల సాగు కోసం సహజ వనరులు వినియోగం గణనీయంగా పెరిగిపోతోంది. పారిశ్రామికీకరణ, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం, హరిత విప్లవం, నీలి విప్లవం, శ్వేత విప్లవం వంటి ఎన్నో మైలు సాధించినప్పటికీ పర్యావరణ సమతుల్యం పాటించలేకపోవడం వల్ల... సహజ వనరులైన నీరు, భూమి, గాలి కలుషితమై మానవాళి, జీవరాశులపై ప్రభావం చూపుతోంది.

అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి నిర్ధేశించిన లక్ష్యాలు దేశాలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా... ప్రత్యేకించి భారత్‌లో పర్యావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సుస్థిర, ఆర్థిక అభివృద్ధి మందగిస్తుండటం సవాల్‌గా మారింది. పారిశ్రామిక వ్యర్థాలు, పొగ, విషపూరిత రసాయనాలు వదలడం వల్ల కలుగుతున్న దుష్ప్రభావాన్ని ప్రపంచ దేశాల ప్రజలు గుర్తించారు. సముద్రాలు, ఎడారుల్లో అణు పరీక్షలు చేయడం వల్ల పర్యావరణానికి ఎదురవుతున్న ముప్పు గుర్తించారు. సరస్సులు ఎండిపోవడం, ఆమ్ల వర్షాలు వంటి విపరిణామాల దృష్ట్యా పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించారు.

పర్యావరణ పరిరక్షణ కోసం సాగుతున్న ఉద్యమాలన్నీ 20వ శతాబ్దంలో కొంత ఊపందుకున్నాయి. న్యూక్లియర్ వ్యర్థాలు పడేయడం, ఉష్ణోగ్రతల్లో మార్పులు, వాయుకాలుష్యం గురించి ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని సుస్థిర, ఆర్థిక లక్ష్యాలతోపాటు సహజ సమతుల్యతతో ముందుకు వెళితే తప్ప పర్యావరణ పరిరక్షణ సాధ్యం కాదంటున్నారు... సీఎస్‌ఐఆర్‌-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ బయో ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంట్ సైన్సెస్‌, ఇంధన గ్రూపు చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ ఎ. గంగాగ్నిరావు.

ఇదీ చూడండి:జూన్​ 30 వరకు లాక్​డౌన్.. కొన్నింటికి అనుమతుల్లేవ్

ABOUT THE AUTHOR

...view details