తెలంగాణ

telangana

ETV Bharat / city

న్యూ దిల్లీలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు - Tirumala latest news

న్యూ దిల్లీలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో.. వార్షిక బ్రహ్మోత్సవాలను మే 23 నుంచి 31 వరకు ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తితిదే ప్రకటించింది.

venkateswaraswamy, new delhi
శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు

By

Published : May 12, 2021, 7:18 PM IST

న్యూ దిల్లీలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించాలని తితిదే నిర్ణయించింది. తితిదే అనుబంధ ఆలయమైన శ్రీవారి ఆలయంలో మే 23 నుంచి 31వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపింది. ఉత్సవాలకు మే 22న‌ సాయంత్రం అంకురార్పణం జ‌రుగ‌నుంది. కొవిడ్‌-19 వ్యాధి వ్యాప్తి నివార‌ణ చ‌ర్యల్లో భాగంగా… ఉత్స‌వాల‌ను ఆల‌య ప్రాంగ‌ణంలో ఏకాంతంగా నిర్వహిస్తారు.

అంతకు ముందు మే 18వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం (ఆలయ శుద్ధి) నిర్వహిస్తారు. మే 23వ తేదీ ఉదయం 7 నుంచి 8 గంటల వ‌ర‌కు వృష‌భ ల‌గ్నంలో ధ్వజారోహణంతో వాహన సేవలను ప్రారంబిస్తారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి. జూన్ 1వ తేదీన సాయంత్రం 5 నుంచి 6 గంట‌ల వ‌ర‌కు పుష్పయాగం నిర్వహించాలని తితిదే నిర్ణయించింది.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు:

తేది ఉదయం సాయంత్రం
23-05-2021 ధ్వజారోహణం పెద్ద‌శేష వాహనం
24-05-2021 చిన్న‌శేష వాహ‌నం హంస వాహనం
25-05-2021 సింహ వాహ‌నం ముత్య‌పుపందిరి వాహ‌నం
26-05-2021 క‌ల్ప‌వృక్ష వాహ‌నం స‌ర్వ‌భూపాల వాహనం
27-05-2021 మోహినీ అవ‌తారం క‌ల్యాణోత్స‌వం, గ‌రుడ వాహ‌నం
28-05-2021 హ‌నుమంత వాహ‌నం గజవాహనం
29-05-2021 సూర్య‌ప్ర‌భ వాహ‌నం చంద్ర‌ప్ర‌భ వాహ‌నం
30-05-2021 ర‌థోత్స‌వం అశ్వ వాహ‌నం
31-05-2021 చక్రస్నానం ధ్వజావరోహణం

ఇదీ చదవండి:నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: సీపీ సజ్జనార్​

ABOUT THE AUTHOR

...view details