ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలి వివాహ రిసెప్షన్ దిల్లీలో ఘనంగా జరిగింది. దిల్లీలోని ఉపరాష్ట్రపతి నిలయంలో జరిగిన ఈ వేడుకకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు, ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పలువురు కేంద్రమంత్రులు, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో పాటు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పలువురు ఎంపీలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి తమ శుభాశీస్సులు అందజేశారు. వెంకయ్యనాయుడు కుమారుడు హర్షవర్దన్-రాధ దంపతుల కుమార్తె నిహారికకు హైదరాబాద్‌కు చెందిన రవితేజతో ఇటీవల వివాహం జరిగిన విషయం తెలిసిందే.
ఘనంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవరాలు వివాహ రిసెప్షన్ - వెంకయ్యనాయుడు మనవరాలి రిసెప్షన్
దిల్లీలోని ఉపరాష్ట్రపతి నిలయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలి వివాహ రిసెప్షన్ దిల్లీలో ఘనంగా జరిగింది. ప్రధాని, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
Venkaiah naidu grand daughter's reception