రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వేళ కొందరు యువకులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ కనబడటం లేదంటూ ఆ నియోజకవర్గానికి చెందిన కొందరు యువకులు శాసనసభను ముట్టడించేందుకు ప్రయత్నించారు.
అసెంబ్లీ ముట్టడికి వేములవాడ యువకుల యత్నం... అరెస్ట్ - telangana assembly updates
తమ ఎమ్మెల్యే కనబడట్లేదంటూ... రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గానికి చెందిన యువకులు అసెంబ్లీని ముట్టడించేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
vemulawada youth tried to siege telangana assembly
అప్రమత్తమైన పోలీసులు యువకులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా.. కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి గోషామహల్ పీఎస్కు తరలించారు.