ఆంధ్రప్రదేశ్ విజయవాడ భవానీపురంలో ఆ రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు అనుచరుడు, వక్ఫ్ బోర్డ్ మాజీ డైరెక్టర్ ఖాజా అనుచరులు వీరంగం సృష్టించారు. షేక్ దావుద్ అనే టీ కొట్టు వ్యాపారిపై దాడికి పాల్పడ్డారు. టీ దుకాణం యజమాని షేక్ దావుద్ను ఖాజా అనుచరులు డబ్బులు ఇవ్వాలని దౌర్జన్యం చేయటంతో... డబ్బులు ఎందుకు ఇవ్వాలని టీ కొట్టు వ్యాపారి ప్రశ్నించాడు. ఖాజా అనుచరులు దుర్భాషలాడి, దాడికి పాల్పడినట్లు బాధితుడు భవానిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
టీ కొట్టు యజమానిపై ఏపీ మంత్రి అనుచరుల వీరంగం - తెలంగాణ వార్తలు
టీ కొట్టు యజమానిపై ఏపీ మంత్రి వెల్లంపల్లి అనుచరుడు, వక్ఫ్ బోర్డ్ మాజీ డైరెక్టర్ ఖాజా అనుచరులు వీరంగం సృష్టించారు. డబ్బులు ఇవ్వాలని టీ కొట్టు యజమానిపై దౌర్జన్యానికి దిగారు. డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించడంతో దాడి చేశారని బాధితుడి ఆవేదన వ్యక్తం చేశారు.
టీకొట్టు యజమానిపై వెల్లంపల్లి అనుచరుల వీరంగం, వెల్లంపల్లి శ్రీనివాస రావు అనుచరులు
కేసు నమోదు చేయొద్దంటూ ఖాజా పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఏకంగా పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఫిర్యాదు దారుడుని బెదిరింపులు చేస్తుంటే పోలీసులు చేష్టలుడికి చూస్తుండిపోయారు.
ఇదీ చదవండి:మాదకద్రవ్యాల మత్తులో యువకుల వీరంగం