అమరావతిని గ్రాఫిక్స్‌లో చూపించారని వైకాపా నేతలు చేస్తున్న విమర్శలను రైతులు తప్పుబట్టారు. ఆ భవనాలపై నుంచి అంతా కలిసి దూకుదామా.. అని సవాల్ విసిరారు. గ్రాఫిక్సే కాబట్టి ఎవరికీ దెబ్బలు తగలవని ఎద్దేవా చేశారు. భవనాలపై నుంచి పడి గాయాలపాలైతే.. గ్రాఫిక్స్ కాదని ఒప్పుకోవాలని అన్నారు. మరిన్ని వివరాలు వెలగపూడి నుంచి ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.
'అమరావతి గ్రాఫిక్స్ భవనాల పై నుంచి దూకుదాం.. వస్తారా?' - రాజధాని రైతుల ఆందోళన న్యూస్
అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ.. వెలగపూడిలో చేస్తున్న దీక్ష 36వ రోజుకు చేరింది. శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే.. పోలీసులు వేధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
amaravathi agitations