ఏపీలోని కృష్ణా జిల్లా జాతీయ రహదారిపై జగ్గయ్యపేట సమీపంలోని గరికపాడు - రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద.. ఈ రోజు వాహనాల తాకిడి గణనీయంగా పెరిగింది. వారాంతం కావడంతో హైదరాబాద్ వెళ్లే వాహనాల సంఖ్య నాలుగైదు రెట్లు పెరిగింది.
Check Posts : వారాంతపు సెలవులు.. చెక్‌పోస్ట్‌ల వద్ద వాహనాల బారులు - vehicle checking at check posts in telangana
వారాంతపు సెలవులు కావడంతో ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని గరికపాడు చెక్‌పోస్ట్‌కు వాహనాల తాకిడి పెరిగింది. పోలీసులు ఈ-పాస్ లేని వాహనాలను వెనక్కి పంపిస్తున్నారు.
ఈపాస్, ఈ-పాస్ తప్పనిసరి, ఏపీ వార్తలు
రోజు వారీ అమలు అవుతున్న ఈ- పాస్ నిబంధనల కారణంగా తనిఖీల కోసం పెద్ద సంఖ్యలో వాహనాలు బారులు తీరి నిలిచిపోయాయి. ఈ-పాస్ లేకుండా తెలంగాణలోకి అనుమతించని కారణంగా ఎక్కువ వాహనాలు అక్కడి నుంచి వెనుతిరగాల్సి వచ్చింది.
- ఇదీ చదవండి :Free Ration: ప్రారంభమైన ఉచిత రేషన్ బియ్యం పంపిణీ