కరోనా రెండో దశ ఉద్ధృతి దృష్ట్యా... నియంత్రణలో భాగంగా ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. దీంతో దినసరి కూలీలు, పేదలు, రోడ్డు పక్కన నివాసం ఉండే వారికి అన్నం దొరకడం కష్టంగా మారింది. ఇలాంటి అపత్కాలంలో వీబీజీ ఫౌండేషన్ సంస్థ అన్నార్థులకు చేయూత అందిస్తూ… తమ దాతృతం చాటుకుంటోంది.
లాక్‌డౌన్ వేళ... నిరుపేదల ఆకలి తీరుస్తున్న సంస్థ - Vbg Foundation latest news
కరోనా విపత్కర పరిస్థితుల్లో అన్నార్థులకు అన్నదానం చేస్తూ... అనేక స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయి. లాక్‌డౌన్ వేళ... కూలీలు, పేదలు, రోడ్డు పక్కక నివాసం ఉండేవాళ్ల ఆకలిని వీబీజీ ఫౌండేషన్ ఆకలి తీర్చుతోంది. నేనున్నానంటూ... వారికి అండగా నిలుస్తోంది.
Vbg Foundation Food Distribution in Hyderabad
ప్రధానంగా నగరంలోని ఆసుపత్రులు, రోడ్డు పక్కన ఉండే వారు, దినసరి కూలీలకు ప్రతి రోజు దాదాపు 700 ఆహార ప్యాకెట్లు అందిస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు రాజు తెలిపారు. ప్రత్యేకంగా కొవిడ్ పేషంట్లకు ప్రత్యేక ఆహారం ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు.
- ఇదీ చూడండి: గాంధీలో కేసీఆర్... రోగులకు ధైర్యం చెప్పిన సీఎం