Entrance Examination Schedule: రానున్న విద్యా సంవత్సరానికి వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూలును ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ప్రకటించారు. మూడేళ్ల ఎల్ఎల్బీ ప్రవేశాల కోసం జులై 21న... అయిదేళ్ల ఎల్ఎల్బీ కోసం 22న లాసెట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎల్ఎల్ఎం ప్రవేశాల కోసం జులై 22న పీజీ ఎల్ సెట్ జరగనుంది. బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జులై 26, 27న ఎడ్‌సెట్ నిర్వహించనున్నట్లు లింబాద్రి తెలిపారు.
Entrance Examination Schedule: వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల..
various entrance examination schedules Release in telangana
15:55 March 29
వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల..
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల కోసం జులై 27, 28న ఐసెట్ జరగనుంది. ఎంటెక్, ఎంఫార్మసీ ప్రవేశాల కోసం జులై 29 నుంచి ఆగస్టు 1 వరకు పీజీఈసెట్ నిర్వహించనున్నట్లు లింబాద్రి తెలిపారు. వ్యాయామ విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీఈసెట్ తేదీలు తర్వాత వెల్లడిస్తామని పేర్కొన్నారు. జూన్ 14 నుంచి 20 వరకు ఎంసెట్... జులై 13న ఈసెట్ నోటిఫికేషన్ సోమవారం విడుదల అయింది.
ఆయా ప్రవేశ పరీక్షల తేదీలు..
- జులై 21న లాసెట్ (మూడేళ్ల కోర్సు), జులై 22న పీజీ ఎల్‌సెట్
- జులై 22న లాసెట్ (ఐదేళ్ల కోర్సు) ప్రవేశ పరీక్ష
- జులై 26, 27 తేదీల్లో ఎడ్‌సెట్, జులై 27, 28 తేదీల్లో ఐసెట్
- జులై 29 నుంచి ఆగస్టు 1 వరకు పీజీ ఈసెట్ పరీక్షలు
ఇదీ చూడండి:
Last Updated : Mar 29, 2022, 7:15 PM IST