మహారాష్ట్రలోని జైలులో ఉన్న విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ)ను ఆశ్రయించారు. అనారోగ్యంతో పాటు కొవిడ్ బారిన పడి ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వరవరరావు ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వివరాలు అందించేలా ఆదేశాలు ఇవ్వాలని వారు కమిషన్‌ను కోరారు. ఈ వ్యవహారంలో జులై 13 కమిషన్ ఇచ్చిన ఆదేశాలను అధికారులు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ఆరోగ్యపరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు సమాచారం ఇవ్వడం లేదని లేఖలో పేర్కొన్నారు.
ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన వరవరరావు కుటుంబ సభ్యులు - ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన వరవరరావు కుటుంబసభ్యులు
వరవరరావు ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వివరాలు అందించేలా ఆదేశాలు ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆయన కుటుంబ సభ్యులు కోరారు. ఆరోగ్యపరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు సమాచారం ఇవ్వడం లేదని లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో జులై 13 కమిషన్ ఇచ్చిన ఆదేశాలను అధికారులు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు.
varavara rao
మావోయిస్టుల బంద్
వరవరరావు ఇతర హక్కుల నేతలను విడుదల చేయాలంటూ శనివారం తెలంగాణలో మావోయిస్టులు బంద్ నిర్వహించారు. అదేవిధంగా అటవీ ప్రాంతాల నుంచి గ్రే హౌండ్స్, కమాండో దళాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.