ఆంధ్రప్రదేశ్‌లోని తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి సన్నిధిలో శుక్రవారం కనులపండువగా వరలక్ష్మీవ్రతం నిర్వహించారు. కరోనా కారణంగా భక్తులు లేకుండా ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు మండపంలో ఉత్సవమూర్తికి పూజలు చేశారు. వ్రతం టిక్కెట్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన 3,507 మంది దంపతులు వర్చువల్ విధానం ద్వారా తమ ఇళ్ల నుంచి పూజలో పాల్గొన్నారు. వీరందరికీ అమ్మవారి ప్రసాదాలను పోస్ట్ ద్వారా పంపించారు. ఎస్వీబీసీ ఛానల్ ద్వారా లక్షల మంది ఉత్సవాన్ని తిలకించారని తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వ్రతంలో వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో బసంత్‌కుమార్ పాల్గొన్నారు.
తిరుచానూరు వరాల తల్లికి వ్రత పూజలు - తిరుచానారులో వరలక్ష్మీ వ్రతం వార్తలు
ఏపీలోని తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి సన్నిధిలో శుక్రవారం కనులపండువగా వరలక్ష్మీవ్రతం నిర్వహించారు. వ్రతం టిక్కెట్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన 3,507 మంది దంపతులు వర్చువల్ విధానం ద్వారా తమ ఇళ్ల నుంచి పూజలో పాల్గొన్నారు. వ్రతంలో వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో బసంత్‌కుమార్ పాల్గొన్నారు.
తిరుచానూరు.. వరాల తల్లికి వ్రత పూజలు