తెలంగాణ

telangana

ETV Bharat / city

Vangaveeti Radha: నన్ను చంపేందుకు రెక్కీ నిర్వహించారు.. వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు - వంగవీటి రంగా విగ్రహావిష్కరణ

తనను చంపడానికి కొందరు రెక్కీ నిర్వహించారని మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంపాలని చూసినా భయపడేది లేదని ఆయన తేల్చి చెప్పారు.

Vangaveeti Radha: నన్ను చంపేందుకు రెక్కీ నిర్వహించారు.. వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు
Vangaveeti Radha: నన్ను చంపేందుకు రెక్కీ నిర్వహించారు.. వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు

By

Published : Dec 26, 2021, 4:53 PM IST

నన్ను చంపేందుకు రెక్కీ నిర్వహించారు.. వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు

Vangaveeti Radha Sensational Comments: కొందరు తనను చంపేందుకు రెక్కీ నిర్వహించారని తెదేపా నేత వంగవీటి రాధా ఆరోపించారు. చంపాలని చూసినా భయపడేది లేదన్న ఆయన.. దేనికైనా సిద్ధమేనని ప్రకటించారు. ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటానని తేల్చిచెప్పారు. వంగవీటి రంగా.. కీర్తి, ఆశయాల సాధనే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఏపీలోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం చినగొన్నూరులో.. రంగా విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాల్గొన్నారు.

"నన్ను చంపేందుకు రెక్కీ నిర్వహించారు. నన్ను చంపాలని చూసినా భయపడను, దేనికైనా సిద్ధం. నేను ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటా. వంగవీటి రంగా కీర్తి, ఆశయాల సాధనే లక్ష్యం" - వంగవీటి రాధా, తెలుగుదేశం పార్టీ నేత

వంగవీటి రాధాతో ఎమ్మెల్యే వంశీ భేటీ..
ఇవాళ ఉదయం తెదేపా నేత వంగవీటి రాధాను.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కలిశారు. విజయవాడలోని రాధా కార్యాలయంలో వీరిద్దిరూ భేటీ అయ్యారు. అనంతరం వంగవీటి రంగా 33వ వర్ధంతి సందర్భంగా బందరు రోడ్డులోని ఆయన విగ్రహానికి రాధా, వంశీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాధా మాట్లాడుతూ.. వంగవీటి రంగా ఆశయ సాధనకు కృషి చేస్తానని చెప్పారు. రంగా వర్ధంతి సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. మరోవైపు వంగవీటి రాధా, వల్లభనేని వంశీ భేటీపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఇదీ చదవండి:

Vangaveeti Ranga Vardhanthi: రంగా ఆశయాల కోసం పనిచేస్తా: వంగవీటి రాధా

ABOUT THE AUTHOR

...view details