Vangaveeti Radha On Gunman: తనకు గన్‌మెన్లు వద్దన్న మాట వాస్తవమేనని తెదేపా నేత వంగవీటి రాధా స్పష్టం చేశారు. నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తినని అందుకే గన్మెన్ల్ వద్దన్నానని తెలిపారు. తన క్షేమంపై అన్ని పార్టీల నేతలు ఫోన్ చేసి అడిగారన్నారు.
Vangaveeti Radha On Gunman: 'నాకు గన్‌మెన్లు వద్దన్న మాట వాస్తవమే' - వంగవీటి రాధా తాజా వార్తలు
Vangaveeti Radha On Gunman: తనకు గన్‌మెన్లు వద్దన్న మాట వాస్తవమేనని తెదేపా నేత వంగవీటి రాధా స్పష్టం చేశారు. నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తినని అందుకే తనకు గన్మెన్ల్ వద్దన్నానని తెలిపారు.
Vangaveeti Radha
తనను చంపేందుకు కొందరు రెక్కీ నిర్వహించారంటూ రాధా ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నాని నిన్న (సోమవారం) సీఎం జగన్‌ను కలిసి ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం నాని మీడియాతో మాట్లాడుతూ..రాధాకు 2 ప్లస్ 2 గన్‌మెన్లు ఇవ్వాలని సీఎం ఆదేశించారని వెల్లడించారు. వెంటనే భద్రత కల్పించాలని ఇంటెలిజెన్స్ డీజీకి ఆదేశించారన్నారు. రాధాపై ఎవరు రెక్కీ చేశారో దర్యాప్తు జరపాలని ఆదేశించారన్నారు.
ఇదీ చదవండి: