తెలంగాణ

telangana

ETV Bharat / city

TTD vaikunta Darshanam Tokens: 'ముగిసిన టోకెన్ల జారీ.. దర్శనానికి ఆ రోజు నుంచే అనుమతి' - ttd latest news

TTD vaikunta Darshanam Tokens: తిరుమల వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీ ప్రక్రియ ముగిసింది. ఈ నెల 13 నుంచి 22 వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి తితిదే ఏర్పాట్లు చేసింది.

TTD vaikunta Darshanam Tokens:
తిరుమల వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీ

By

Published : Jan 10, 2022, 6:16 PM IST

TTD vaikunta Darshanam Tokens: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీ ప్రక్రియ ముగిసింది. ఈ నెల 13 నుంచి 22 వరకు పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనానికి తితిదే ఏర్పాట్లు చేసింది. 10 రోజుల పాటు రోజుకు 5 వేల చొప్పున 50 వేల టికెట్లు స్ధానికులకు జారీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది.

Tokens in tirumala: నేటి నుంచి టికెట్లు జారీ చేయనున్నట్లు తితిదే ప్రకటించినా.. ఆదివారం సాయంత్రం నుంచి తిరుపతిలోని టికెట్లు జారీ చేసే కేంద్రాలకు భక్తులు తరలిరావడంతో ప్రకటించిన సమయం కంటే ముందే పూర్తి చేసింది. నగరంలోని రామచంద్ర పుష్కరణి, ఎమ్మార్ పల్లి జడ్పీ హైస్కూల్, బైరాగిపట్టెడ రామానాయుడు హైస్కూల్, సత్యనారాయణ పురం జడ్పీ హైస్కూల్, నగరపాలక సంస్ధ కేంద్రాల్లో టికెట్ల జారీ కొనసాగించింది. ఉదయం 9 గంటలకే టోకెన్ల జారీ ప్రక్రియ ముగిసింది.

పర్యావరణహితంగా తీర్చిదిద్దేందుకు చర్యలు: ఈవో

TTD EO: పర్యావరణహిత ఇంధన సామర్థ్య పుణ్యక్షేత్రంగా తిరుమలను తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్లు తితిదే ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. తితిదే, ఇంధనశాఖ అధికారులతో నిర్వహించిన వర్చువల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు.

దేశంలోని ప్రముఖ యాత్రా స్థలాలను పర్యావరణహితంగా తీర్చిదిద్దాలని బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియన్సీ (బీఈఈ) ప్రతిపాదించింది. ఇందులో భాగంగా తితిదేతో పాటు వివిధ రాష్ట్రాల్లోని పలు పర్యాటక స్థలాలను బీఈఈ ఎంపిక చేసింది. తితిదే భవనాల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అమలు చేయటం ద్వారా విద్యుత్‌ వినియోగాన్ని గరిష్ఠ స్థాయిలో తగ్గించడం, పునరుత్పాదక ఇంధన కార్యక్రమాల ద్వారా కొంత మేర విద్యుత్‌ను ఆ భవనాల్లో ఉత్పత్తి చేయడమే లక్ష్యం’

- జవహర్‌ రెడ్డి, తితిదే ఈవో

ఇదీ చదవండి:

BJP PROTEST: ఆత్మకూరు ఘటనకు నిరసనగా.. నేడు రాష్ట్రవ్యాప్తంగా భాజపా నిరసనలు

ABOUT THE AUTHOR

...view details