'మార్చిలో వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వ్యాక్సిన్'
19:53 February 05
'50ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు మార్చిలో వ్యాక్సిన్'
మార్చి రెండో వారం నుంచి 50ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు వ్యాక్సిన్ ప్రారంభిస్తామని డీహెచ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. హెల్త్ కేర్ వర్కర్లకు ఫిబ్రవరి 13 నుంచి కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ ఇచ్చే అవకాశం ఉందన్నారు. శనివారం నుంచి ఈ నెల 12వ తేదీ వరకు ఫ్రంట్ లైన్ వర్కర్లకు వాక్సినేషన్ ప్రారంభిస్తామన్నారు. వ్యాక్సిన్ తీసుకోని హెల్త్ వర్కర్లకు మరో మారు వ్యాక్సిన్ ఇవ్వబోమని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ కోసం సుమారు 2 లక్షల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు.
ఇదీ చూడండి:ప్రజాప్రతినిధులకు సమన్లు.. ఎందుకంటే..?