వ్యాక్సిన్ పంపిణీలో ప్రపంచ రికార్డు సృష్టించేందుకు ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రయత్నిస్తోంది. ఒక్కరోజే 8 నుంచి 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 'వ్యాక్సినేషన్ సండే'(Vaccination Sunday) పేరిట.. నేడు అత్యధిక మందికి వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రికార్డు తిరగరాసేందుకు ప్రణాళిక..
ఇప్పటికే అత్యధికంగా 6 లక్షల డోసులను ఒక్కరోజులోనే వేసిన రికార్డును రాష్ట్రం సొంతం చేసుకోగా.. నేడు 10 లక్షల డోసుల వ్యాక్సిన్ వేసి మరో రికార్డును సొంతం చేసుకోవాలని మెగా డ్రైవ్ తో(Megha vaccination drive) ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే 14 లక్షల వ్యాక్సిన్ డోసులను జిల్లాలకు సరఫరా కూడా పూర్తిచేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు వైద్యారోగ్యశాఖ లక్ష్యాన్ని నిర్దేశించింది. నిబంధనల ప్రకారం అర్హత ఉన్నవారందరికీ తొలిడోసుతో పాటు రెండో డోసు వ్యాక్సిన్ను వేయనున్నారు.
ఇప్పటిదాకా ఇచ్చిన డోసుల వివరాలు..