రాష్ట్రం నుంచి ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే వారికోసం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లే ఉద్యోగులకు రాష్ట్రవ్యాప్తంగా 10 కేంద్రాల్లో టీకాలు అందించనున్నట్టు ప్రకటించింది. అర్హులు అయిన వారు పాస్‌పోర్ట్‌తో పాటు వర్క్ పర్మిట్ వీసాను సంబంధిత వ్యాక్సిన్ కేంద్రాల్లో చూపించి టీకాలు తీసుకోవచ్చని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. విదేశాలకు వెళ్లేవారికి 28రోజుల వ్యవధిలో కొవిషీల్డ్ టీకా రెండుడోసులను అందించనున్నట్టు పేర్కొంది. లబ్ధిదారులు కొవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవడంతో పాటు రెండో డోస్ పూర్తి అయిన తరువాత పాస్‌పోర్ట్, వీసా డాక్యుమెంట్లను కొవిన్‌లో పొందుపర్చాల్సి ఉంటుందని పేర్కొంది.
Vaccination: విదేశాలకు వెళ్లే వారికోసం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం - telangana varthalu
ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే వారికోసం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. విదేశాలకు వెళ్లే ఉద్యోగులకు రాష్ట్రవ్యాప్తంగా 10 కేంద్రాల్లో టీకాలు అందించనున్నట్టు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
ఇక ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని డీఎంహెచ్వోలను ఆరోగ్యశాఖ ఆదేశించింది. ఇక విదేశాలకు వెళ్లే ఉద్యోగులకు జిల్లాల వారిగా టీకా కేంద్రాలను కేటాయించింది. ఆదిలాబాద్ రిమ్స్‌లోని పీపీ యూనిట్, నిజామాబాద్ యూపిహెచ్సీ వినాయక్ నగర్, కరీంనగర్లో యూపీహెచ్సీ బుట్టరాజారం కాలనీ, వరంగల్ యూపీహెచ్సీ లష్కర్ సింగారం, ఖమ్మం వెంకటేశ్వరా నగర్ యూపీహెచ్సీ, మెదక్ యూపీహెచ్సీ, మహబూబ్ నగర్లో రమజబౌలీ యూపీహెచ్సీ , నల్గొండలో పానగల్ యూపీహెచ్సీ, రంగారెడ్డిలో సరూర్ నగర్ యూపీహెచ్సీ, హైదరాబాద్‌లో ఆర్ఎఫ్టీసీ యూపీహెచ్సీ, తరమైదాన్ యూపీహెచ్‌సీలో టీకాలు అందించనున్నారు.
ఇదీ చదవండి: TS CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 993 కరోనా కేసులు, 9 మరణాలు