అసెంబ్లీ సమావేశాలు అర్ధాంతరంగా ముగించడమేంటని మాజీ ఎంపీ వి. హనుమంతరావు మండిపడ్డారు. అసెంబ్లీలో చర్చించాల్సిన సమస్యలు అనేకం ఉన్నాయని... ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వడంలేదని వీహెచ్ ఆరోపించారు. కేవలం కొత్త రెవెన్యూ చట్టం ఆమోదం కోసమే అసెంబ్లీ సమావేశాలు పెట్టారని ఆక్షేపించారు.
'కేవలం కొత్త రెవెన్యూ చట్టం ఆమోదం కోసమే సమావేశాలా?' - assembly meetings in telangana
అసెంబ్లీ సమావేశాలు అర్ధాంతరంగా ముగించటంపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ధ్వజమెత్తారు. కేవలం కొత్త రెవెన్యూ చట్టం ఆమోదం కోసమే సమావేశాలు పెట్టారా అని నిలదీశారు.
v hanumatha rao responded on assembly meetings adjourned in telangana
రెవెన్యూ చట్టం ఆమోదం పొందగానే సమావేశాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారని దుయ్యబట్టారు. కరోనా వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుద్యోగ సమస్యలపై చర్చించాల్సిన అవసరముందని తెలిపారు. సంఖ్యాపరంగా మాట్లాడే అవకాశం ఇవ్వడం సరైంది కాదని హనుమంతరావు అభిప్రాయపడ్డారు.