కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో.. ఏ మంత్రిగాని.. ముఖ్యమంత్రి గాని.. స్పందించకున్నా.. ఈటల సత్వరమే స్పందించారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. ఈటలపై ఆరోపణలు వచ్చిన వెంటనే.. విచారణకు ఆదేశించారని.. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో విచారణ చేయడమేంటని ప్రశ్నించారు.
ప్రశ్నించినందుకే ఈటలపై కుట్ర: వీహెచ్ - vh reaction on etela issue
కేంద్రాన్ని ప్రశ్నించినందుకే ఈటలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆరోపించారు. కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే గతంలోనే ఎందుకు విచారణకు ఆదేశించలేదని ప్రశ్నించారు.
మంత్రి ఈటల, మంత్రి ఈటల రాజేందర్, ఈటలపై ఆరోపణలపై వీహెచ్ స్పందన
కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే గతంలో ఎందుకు విచారణకు ఆదేశించలేదని ప్రశ్నించారు. ఈటల మాత్రమే కాదు.. అన్ని పార్టీల నేతల భూకబ్జా ఆరోపణలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్లో కిరాయి అడగొద్దన్న సీఎం.. కరోనా కష్టకాలంలో ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని ఎందుకు అరికట్టలేకపోతున్నారని వీహెచ్ నిలదీశారు.
- ఇదీ చదవండివాస్తవాలన్నీ బయటకు రావాలి: ఈటల రాజేందర్