హైదరాబాద్ గాంధీ భవన్లో మీడియా సమావేశం నిర్వహించిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెరాసపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఒక్క ఎన్నికల్లో కూడా గెలవని అధికార పార్టీ నాయకులు తనపై మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తాను గెలిచినన్ని సార్లు ఎవరు గెలవలేదని తెలిపారు.
'ఒక్క ఎన్నికల్లో కూడా గెలవనివారు నా గురించి మాట్లాడుతున్నారు' - 'రిజర్వేషన్ ప్రకటనకు.. నామినేషన్‌కు కాస్త సమయమివ్వండి'
మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనవరి 6న రిజర్వేషన్లను ప్రకటించి.. నామినేషన్లను 8న చేయాలంటే ఇబ్బంది ఏర్పడుతుందని ఉత్తమ్ అన్నారు. తన మాటలను కొందరు కావాలనే వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు.
'రిజర్వేషన్ ప్రకటనకు.. నామినేషన్‌కు కాస్త సమయమివ్వండి'
నామినేషన్‌కు రెండు రోజుల ముందు రిజర్వేషన్లను ప్రకటిస్తే.. అభ్యర్థుల ఎంపిక చేయడం, బి-ఫామ్‌లు ఇవ్వడంలో ఇబ్బంది ఎదురవుతుందని తెలిపినట్లు ఉత్తమ్ పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ఫైనల్ కాకుండా షెడ్యూల్ ఎక్కడైనా ఇస్తారా అని ఉత్తమ్ ప్రశ్నించారు.
ఇవీ చూడండి: దశాబ్ది సవాల్: స్వచ్ఛ ఇంధనంతో పచ్చని జీవితం
Last Updated : Dec 26, 2019, 3:03 PM IST