తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ 66వ జన్మదినోత్సవం సందర్భంగా.. రాష్ట్రమంతటా పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రముఖులు, అధికారులు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఉదయం నుంచి జాతీయ నేతలు, రాష్ట్ర ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు చెబుతున్నారు.
సీఎం కేసీఆర్కు ఉత్తమ్ శుభాకాంక్షలు
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆయనకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
cm kcr
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ట్వీట్ చేశారు. మేఘాలయ సీఎం సంగ్మా కూడా ట్విట్టర్లో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి:నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ 66వ పుట్టినరోజు