"ముఖేశ్ గౌడ్ మరణం పార్టీకి తీరని లోటు" - ముఖేశ్ గౌడ్
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ మరణం పార్టీకి తీరని లోటని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
"ముఖేశ్ గౌడ్ మరణం పార్టీకి తీరని లోటు"
కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేశ్ గౌడ్ కార్పొరేటర్‌గా, ఎమ్మెల్యేగా, సుదీర్ఘ కాలం మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ఎనలేని సేవ చేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటని తెలిపారు. ముఖేశ్‌గౌడ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆయన కుటుంబానికి ఎల్లప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
- ఇదీ చూడండి : సాయుధ దాడులకు వేలాది మంది బాలలు బలి