'సునీల్ శర్మ అఫిడవిట్‌ను సుమోటోగా తీసుకోవాలి' - gandhi bhavan news
ఆర్టీసీ ఇంఛార్జీ ఎండీ సునీల్ శర్మ తీరుపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సునీల్‌శర్మ సమర్పించిన అఫిడవిట్‌ను న్యాయస్థానం సుమోటోగా స్వీకరించాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కోరారు.
హైకోర్టులో ఆర్టీసీ ఇంఛార్జీ ఎండీ సునీల్ శర్మ సమర్పించిన అఫిడవిట్‌పై టీపీసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఒక ఐఏఎస్ ఆధికారి చెప్పడం సరికాదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచే ఆలోచనలేవి తమకు లేవని తెలిపారు. ఆర్టీసీ ఇంఛార్జీ ఎండీపై చర్యలు తీసుకోవాలని కోరారు. సునీల్‌శర్మ సమర్పించిన అఫిడవిట్‌ను న్యాయస్థానం సుమోటోగా స్వీకరించాలని కోరారు. ఎవరి ప్రోద్భలంతో నిరాధార అంశంపై కోర్టులో అఫిడవిట్ వేశారని ఆయన ప్రశ్నించారు. ఈ అంశాన్ని లోక్‌సభలో కూడా లేవనెత్తుతామని ఉత్తమ్ పేర్కొన్నారు.