తెలంగాణ

telangana

ETV Bharat / city

'ధనిక రాష్ట్రంలో ఉద్యోగుల వేతనాల్లో కోతేంటి' - ఉద్యోగుల వేతనాల్లో కోతపై కాంగ్రెస్ మండిపాటు

కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్పందించారు. వైరస్ కట్టడికి తీసుకున్న లాక్​డౌన్​కు​ మద్దతు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడంపై మండిపడ్డారు.

utham and bhatti fire on state governament about employees salary cuttings
'ధనిక రాష్ట్రంలో ఉద్యోగుల వేతనాల్లో కోతేంటి'

By

Published : Apr 1, 2020, 2:56 PM IST

Updated : Apr 1, 2020, 3:11 PM IST

కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తెలంగాణ కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడం సరికాదన్నారు. 10 రోజుల లాక్​డౌన్​కే ధనిక రాష్ట్రమైన తెలంగాణ దివాలా తీయడమేంటని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ప్రజలకు అందించే బియ్యంపై స్పష్టత ఇవ్వాలన్నారు.

'ధనిక రాష్ట్రంలో ఉద్యోగుల వేతనాల్లో కోతేంటి'

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గణనీయంగా ఉందంటూ లక్ష 80 వేల కోట్ల బడ్జెట్​ ఆమోదింపజేసిన ముఖ్యమంత్రి... 15 రోజుల్లోనే ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడం సమంజసం కాదని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. కరోనా నివారణ చర్యలకు ఎన్ని కోట్లు ఖర్చు చేసిందని ప్రశ్నించారు. ప్రభుత్వ ఖర్చు చేస్తున్నదాని కంటే విరాళాలే అధికంగా వస్తున్నాయని ఎద్దేవా చేశారు.

'ధనిక రాష్ట్రంలో ఉద్యోగుల వేతనాల్లో కోతేంటి'

ఇదీ చూడండి:రామోజీ రావుకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు

Last Updated : Apr 1, 2020, 3:11 PM IST

ABOUT THE AUTHOR

...view details