ఏపీ పునర్విభజన సలహా కమిటీ సూచనలతో పోలీస్ శాఖలో తుది కేటాయింపులు జరపాలంటూ కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. విభజన జరిగి ఆరేళ్లు గడుస్తున్నా.. పోలీస్ శాఖపై కేంద్రం ప్రేక్షక పాత్ర వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తుది కేటాయింపుల్లో ఇరు రాష్ట్రాల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు.. కేవలం సలహాతోనే సరిపెట్టుకుంటుందా.. అని కేంద్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం కల్పించిన అధికారాన్ని వినియోగించి.. నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ మొత్తం ప్రక్రియ.. తీర్పు ప్రతి అందిన ఆరు వారాల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఇందుకు తెలంగాణ, ఏపీ డీజీపీలు సహకరించాలని సూచించింది.
ఎస్పీల కేటగిరీలో ఉన్న తమను మాతృ రాష్ట్రానికి పంపకపోవడం.. తుది కేటాయింపులు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్లోని చార్మినార్ ట్రాఫిక్ ఎసీపీ జి.నాగన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
1989లో కర్నూలులో ఎస్సైగా నియమితులై 2009లో డీఎస్పీగా పదోన్నతి పొందాను. రాష్ట్ర విభజన ప్రక్రియలో తనతోపాటు మరో 10 మంది డీఎస్పీలను.. తెలంగాణకు తాత్కాలిక ప్రాతిపదికన కేటాయించారు. తెలంగాణకు బలవంతంగా ఐచ్ఛికం ఇప్పించారు. ఉపసంహరించుకుంటున్నానని 2017లో రెండుసార్లు సలహా కమిటీకి వినతి పత్రం ఇచ్చినా.. 2017లో ఏపీ డీజీపీ రిలీవ్ చేయగా తెలంగాణలో విధుల్లో చేరారు. పిటిషన్ పెండింగ్లో ఉండగానే ఈ ఏడాది ఏప్రిల్ 30న పదవీ విరమణ చేశాను. ఇప్పటికీ తుది కేటాయింపులు పూర్తికాలేదని.. అప్పట్లోనే కేటాయింపులు జరిగి ఉంటే ఏపీకి వెళ్లే వాడినన్నారు. 60 ఏళ్ల సర్వీస్ ఉండేదని తెలిపారు. తెలంగాణలో ఉండిపోవడం వల్ల ఆ ప్రయోజనం పొందలేకపోయానంటూ ..హైకోర్టులో నాగన్న పిటిషన్ దాఖలు చేశారు.
అందరికీ వర్తిస్తుంది..
ఈ వ్యాజ్యంపై ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి. అమర్నాథ్ గౌట్లతో కూడిన ధర్నాసనం 37 పేజీల తీర్పును వెలువరించింది. ఈ పిటిషన్ ఒక వ్యక్తికి చెందినదే అయినా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పనిచేసే అధికారులందరికీ వర్తిస్తుందని న్యాయస్థానం పేర్కొంది. అందువల్ల ఈ కేసును ఒక వ్యక్తికి చెందిన కేసుగా పరిగణించలేమంది.
అవకాశాలు ఇచ్చినా..