కొవిడ్ నేపథ్యంలో ఇంటి వద్ద చదువుకునేందుకు పిల్లలకు ఎటువంటి వనరులున్నాయి? కుటుంబసభ్యుల సహకారం.. ఆయా పాఠశాలల నుంచి అందుతోన్న విద్యాసామగ్రి.. తదితర అంశాలపై ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ దేశవ్యాప్తంగా గత సెప్టెంబరులో ఫోన్ ద్వారా సర్వే నిర్వహించింది. విద్యా వార్షిక నివేదిక(ఆసర్)-2020 పేరిట తాజాగా దాన్ని విడుదల చేసింది. తెలంగాణలో సర్కారు బడుల్లో చదివే 65.70 శాతం, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివే 79.20 శాతం పిల్లలకు కుటుంబసభ్యుల నుంచి చదువుకునేందుకు సహకారం అందుతోందని సర్వే వెల్లడించింది. అంటే మొత్తం మీద 72 శాతం పిల్లలకు సహకారం లభిస్తోంది. ప్రైవేటు పాఠశాలల్లో చదివే వారి ఇళ్లలోనూ స్మార్ట్‌ఫోన్లు బాగా పెరిగాయని సర్వే తెలిపింది.
సర్కారీ విద్యార్థులు స్మార్ట్.. తేల్చిన ఆసర్-2020 సర్వే... - online classes in Telangana
కరోనా కారణంగా ఇళ్ల వద్ద ఉంటున్న పిల్లల్లో 72 శాతం మందికి కుటుంబ సభ్యులు ఎవరో ఒకరి నుంచి చదువుకునేందుకు సహకారం అందుతోంది. 2018తో పోల్చితే సర్కారు పాఠశాలల విద్యార్థుల ఇళ్లలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం గణనీయంగా పెరిగిందని ఆసర్-2020 సర్వే తేల్చింది.
సర్కారీ విద్యార్థులు స్మార్ట్
* వాట్సప్ ద్వారా 47.30 శాతం, 33 శాతం ఫోన్ ద్వారా విద్యార్థులకు విద్యా సామగ్రి అందుతోంది.
* 2018తో పోల్చుకుంటే ఈ సారి ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో బాల, బాలికల శాతం స్వల్పంగా పెరిగింది. 2018లో మొత్తం బాలురలో సర్కారు విద్యాసంస్థల్లో 55.3 శాతం ఉండగా ఈ సారి అది 55.8 శాతానికి పెరిగింది. బాలికల శాతం 61.6 శాతం నుంచి 63.4 శాతానికి పెరిగింది.
- ఇదీ చూడండిపాత ఫోనిస్తే.. పేదపిల్లలకు ఇస్తాం...